భారత్‌కు షాక్.. వరల్డ్ కప్ మొత్తానికి Hardik Pandya దూరం..!

by Mahesh |   ( Updated:2023-10-26 08:09:49.0  )
భారత్‌కు షాక్.. వరల్డ్ కప్ మొత్తానికి Hardik Pandya దూరం..!
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ కు షాక్ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న హర్ధిక్ పాండ్యా గాయం కారణంగా ఐదో మ్యాచుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో అతను రెండు మ్యాచుల తర్వాత జట్టులోకి వస్తాడని అధికారులు చెప్పారు. కానీ ప్రస్తుతం అతని గాయం కోలుకునే స్థితిలో లేదని తెలుస్తుంది. దీంతో హర్ధిక్ పాండ్యా వన్డే వరల్డ్ కప్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే భారత్ తర్వాత మ్యాచుల్లో బౌలింగ్ విభాగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. ఎందుకు హర్ధిక్ పాండ్యా జట్టు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థి బ్యాటర్ల భాగస్వామ్యాలను సునాయాసంగా బ్రేక్ చేయగలడు. హర్ధిక్ లేకుండా ఆ స్థానం భర్తీ చేసేందుకు మరో ఆల్‌రౌండర్ కావాల్సి ఉంది. ఎందుకంటే హర్ధిక్ పాండ్యా బ్యాటింగ్ లోను భారత్ ను గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్.

Advertisement

Next Story

Most Viewed