ప్రేమికుల రోజున రెండోసారి గ్రాండ్‌గా వివాహం చేసుకున్న హార్దిక్ పాండ్యా

by Mahesh |   ( Updated:2023-02-15 14:00:16.0  )
ప్రేమికుల రోజున రెండోసారి గ్రాండ్‌గా వివాహం చేసుకున్న హార్దిక్ పాండ్యా
X


దిశ, వెబ్‌డెస్క్: భారత టీ20 క్రికెట్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఉదయపూర్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా మోడల్-నటి నటాసా స్టాంకోవిక్‌ను హార్దిక్ రెండో సారి పెళ్లి చేసుకున్నాడు. గతంలో వీరిద్దరు కోర్టులో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ రెండోసారి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

కాగా వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. హార్దిక్ తన ప్రేయసిని రెండోసారి పెళ్లి చేసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోలకు హార్దిక్.. "మూడేళ్ళ క్రితం మేము తీసుకున్న ప్రతిజ్ఞను పునరుద్ధరించడం ద్వారా మేము ఈ ప్రేమ ద్వీపంలో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నాము" అని వారు రాశారు.

ఇవి కూడా చదవండి : డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఢీ

Advertisement

Next Story