Harbhajan singh : దుబాయ్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా హర్భజన్ సింగ్

by Sathputhe Rajesh |
Harbhajan singh : దుబాయ్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా హర్భజన్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ లెజెండ్ హర్భజన్ సింగ్ అరుదైన గౌరవం అందుకున్నాడు. దుబాయ్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా హర్భజన్‌ను నియమించినట్లు దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ గురువారం అనౌన్స్ చేసింది. దేశ క్రీడారంగం అభివృద్ధికి ఈ నియామకం ఎంతోగానే దోహదపడుతుందని కౌన్సిల్ అభిప్రాయపడింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఆ దేశ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ రషీద్ అల్ మక్తూమ్ సమక్షంలో యూఎఫ్‌సీ లెజెండ్ ఖబీబ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఫుట్ బాల్ ఐకాన్ ప్యాట్రిస్ ఎవ్రా ఈ నియామక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘దుబాయ్‌ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా తనను నియమించడం గౌరవంగా భావిస్తున్నాను. దుబాయ్‌లో క్రీడలకు బలమైన పునాది వేయడంతో పాటు ప్రతిభను వెలికి తీయడం, ప్రీమియర్ స్పోర్ట్స్ ఈవెంట్‌లను దేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా..’ అన్నారు.

Advertisement

Next Story