ఆ పని చేసినందుకు జైశ్వాల్‌పై ఫైర్ అయిన సునీల్ గవాస్కర్

by Harish |
ఆ పని చేసినందుకు జైశ్వాల్‌పై ఫైర్ అయిన సునీల్ గవాస్కర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను సౌతాఫ్రికా పర్యటనలో మందలించినట్టు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ అదరగొట్టిన విషయం తెలిసిందే.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గవాస్కర్.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడంపై అతన్ని సున్నితంగా మందలిచ్చినట్టు తెలిపాడు.

‘ఇంగ్లాండ్‌పై భారీగా పరుగులు చేయడం, ఎటాకింగ్ గేమ్‌తో ఆధిపత్యం ప్రదర్శించిన అతని విధానం పట్ల ఆనందంగా ఉంది. వెస్టిండీస్‌తో టెస్టులో జైశ్వాల్ నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. దీనిపై సౌతాఫ్రికాలో తొలి టెస్టులో మొదటి రోజు హోటల్ లిఫ్ట్‌లో అతన్ని మందలించాను. హాఫ్ సెంచరీ తర్వాత బౌలర్లకు సులువుగా వికెట్ సమర్పించుకోవద్దని చెప్పాను. అతను నా మాట విన్నాడు. ఇంగ్లాండ్‌పై చెలరేగాడు. నేను చెప్పింది అతను మరిచిపోయాడు. 20 ఏళ్ల వయసులో చెప్పిన మాట ఎవరూ వినరు. నేను కూడా అంతే కావచ్చు. అతను గొప్ప ఘనతలు సాధించాలి. భారత క్రికెట్ వల్లే అతను ఇక్కడ ఉన్న విషయాన్ని జైశ్వాల్ మర్చిపోడని భావిస్తున్నా.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా, టీమ్ ఇండియా 4-1తో సిరీస్ దక్కించుకోవడంలో జైశ్వాల్ కీలక పాత్ర పోషించాడు. రెండు డబుల్ సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు చేసిన అతను 712 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Advertisement

Next Story

Most Viewed