IPL FINAL 2023: నిన్న టికెట్ తీసుకున్న అభిమానులకు గుడ్ న్యూస్

by GSrikanth |
IPL FINAL 2023: నిన్న టికెట్ తీసుకున్న అభిమానులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే ఆగిపోయింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం కారణంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ మైదానం వేదికగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. వర్షం ఏ క్షణంలో ఆగిపోతుందో తెలియక, మళ్లీ ఏ టైమ్‌కు ప్రారంభం అవుతుందో అర్ధంకాక అభిమానులు ఎంతో ఓపికగా ఎదురుచూశారు. అయినా వరుణుడు కరుణించలేదు. దీంతో అనివార్య పరిస్థితుల్లో మ్యాచ్ ఇవాళ్టికి(మే 29) వాయిదా పడింది. దీంతో నిన్న మైదానంలో మ్యాచ్ చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానుల్లో సందేహం నెలకొంది.

మ్యాచ్ జరగకపోవడంతో టికెట్ డబ్బులు వాపస్ చేస్తారా? లేదా? ఇవాళ చూసేందుకు అవకాశం కల్పిస్తారా? అనే అనుమానం ఉండింది. దీంతో అభిమానులకు నరేంద్ర మోడీ స్టేడియం సిబ్బంది కీలక ప్రకటన చేసింది. వర్షం కారణంగా నేటికి వాయిదా పడిన మ్యాచ్‌ను నిన్న టికెట్ తీసుకున్న ప్రేక్షకులకు మ్యాచ్ చూసేందకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ కప్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్‌తో గత సీజన్‌లో కప్ సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్‌లో పోటీ పడనున్నాయి. హోం గ్రౌండ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో గుజరాత్ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. మరి ఇవాలైనా మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి. కాగా, ఐపీఎల్‌-19 సీజన్ విన్నర్‌కు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. రన్నరప్ టీమ్‌కు రూ.15 కోట్లు ఇవ్వనున్నారు.

Advertisement

Next Story