జర్మనీ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్న గాయత్రి జోడీ

by Harish |
జర్మనీ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్న గాయత్రి జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : జర్మనీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన ఉమెన్స్ డబుల్స్‌ రెండో రౌండ్‌లో గాయత్రి జోడీ 21-10, 21-11 తేడాతో చెక్ రిపబ్లిక్‌కు చెందిన సోనా హొరింకోవా-కాటేరినా జుజాకోవ్ జోడీని చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో గాయత్రి, ట్రీసా జాలీ కేవలం 28 నిమిషాల్లోనే ప్రత్యర్థుల ఆట ముగించారు. మరోవైపు, సింగిల్స్‌లో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో యువ ఆటగాడు సతీశ్ కుమార్ కరుణాకరన్ 18-21, 22-24 తేడాతో ఐర్లాండ్ ప్లేయర్ నాట్ న్గుయెన్ చేతిలో పోరాడి ఓడాడు. అలాగే, ఉమెన్స్ సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 13-21, 14-21 తేడాతో డెన్మార్క్ క్రీడాకారిణి మియా బ్లిచ్‌ఫీల్డ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

Advertisement

Next Story