క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ ఓటమి

by Harish |
క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : జర్మనీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. సింగిల్స్‌లో ఇప్పటికే భారత షట్లర్లు ఇంటిదారి పట్టగా.. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ సైతం క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గాయత్రి జోడీ 16-21, 14-21 తేడాతో చైనాకు చెందిన లి యి జింగ్-లివో జు మిన్ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో ఒక దశలో 8-5తో ఆధిక్యంలో ఉన్న గాయత్రి, ట్రీసా జాలీ జోడీ ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయింది. అయితే, 15-15 వరకు పోటీనిచ్చిన భారత జంట అనంతరం అనవసర తప్పిదాలతో తొలి గేమ్‌ను కోల్పోయింది. ఇక, రెండో గేమ్‌లో ప్రత్యర్థి జంట దూకుడును గాయత్రి జోడీ నిలువరించలేకపోయింది. ఫిబ్రవరిలో జరిగిన థాయిలాండ్ ఓపెన్‌లోనూ గాయత్రి జోడీ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది.

Advertisement

Next Story