- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంజీ ట్రోఫీ ఫీజులు కూడా పెంచాలి : బీసీసీఐకి సునీల్ గవాస్కర్ విజ్ఞప్తి
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల బీసీసీఐ ప్రవేశపెట్టిన టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభినందించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో గవాస్కర్ మాట్లాడుతూ టెస్టులు ఆడే క్రికెటర్లకు రివార్డులు ఇవ్వడం చాలా బాగుందన్నాడు. అలాగే, దేశవాళీ క్రికెట్‌పై ఫోకస్ పెట్టాల్సిన అవసరముందని చెప్పాడు. ఈ సందర్భంగా బోర్డుకు పలు సూచనలు చేశాడు. ‘రంజీ ట్రోఫీ ఫీజులను రెండింతలు లేదా మూడింతలు చేయాలి. దీని ద్వారా చాలా మంది రంజీ ట్రోఫీ ఆడటానికి ముందుకొస్తారు. 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడితే ఎక్కువ మొత్తం పొందేలా స్లాబ్ పద్ధతిని అమలు చేయాలని బోర్డును అభ్యర్థిస్తున్నా.’ అని గవాస్కర్ తెలిపాడు. అలాగే, రంజీ ట్రోఫీని అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో నిర్వహించాలని సూచించాడు. అప్పుడు జాతీయ జట్టుకు ఆడని ప్రతి ఒక్కరూ రంజీ ట్రోఫీకి అందుబాటులో ఉంటారని చెప్పాడు. జనవరి నుంచి వన్డేలు ఆడటం ద్వారా ఐపీఎల్‌కు కూడా తగినంత ప్రాక్టీస్ దొరుకుతుందని గవాస్కర్ తెలిపాడు.