- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వైఖరితో అతను హెడ్ కోచ్‌గా ఉండలేడు.. గంభీర్‌పై టీ20 వరల్డ్ కప్ విన్నర్ జోగిందర్ శర్మ సంచలన వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత మాజీ పేసర్ జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన కోచ్‌గా గంభీర్ ఎక్కువ కాలం ఉండలేడని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జోగిందర్.. ముక్కుసూటితనం, బహిరంగంగా మాట్లాడే స్వభావం కారణంగా గంభీర్ ఊహించిన దానికంటే ముందే ఆ పదవి నుంచి తప్పుకోవచ్చని చెప్పాడు. ‘ప్రధాన కోచ్ పదవిలో గంభీర్ ఎక్కువ కాలం ఉండలేడని అనుకుంటున్నా. అతను సొంత నిర్ణయాలు తీసుకోవడమే అందుకు కారణం. కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లతో విభేదాలు రావొచ్చు. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడటం లేదు. చాలా సార్లు గంభీర్ నిర్ణయాలు ఇతరులకు నచ్చవు. అతను నిర్మొహమాటంగా మాట్లాడతాడు. అతను ఎవరి దగ్గరికి వెళ్లడు. పొగిడే వ్యక్తి కాదు. తన పనిని నిజాయతీగా చేస్తాడు.’అని చెప్పుకొచ్చాడు. కాగా, 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో జోగిందర్, గంభీర్ సభ్యులుగా ఉన్నారు.