'కపిల్‌ దేవ్‌ కిడ్నాప్‌ అయ్యాడా..?' సంచలన వీడియో షేర్‌ చేసిన గంభీర్‌

by Vinod kumar |
కపిల్‌ దేవ్‌ కిడ్నాప్‌ అయ్యాడా..? సంచలన వీడియో షేర్‌ చేసిన గంభీర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ (1983) కపిల్‌ దేవ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది. టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ షేర్‌ చేసిన ఈ వీడియోలో కపిల్‌ దేవ్‌ కిడ్నాప్‌కు గురైనట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు కపిల్‌ దేవ్‌లా కనినిస్తున్న వ్యక్తిని చేతులు వెనుక్కు కట్టి, మాట్లాడకుండా నోటిని బట్టతో కట్టేసి బలవంతంగా లాక్కెళ్లుతున్నారు. ఆ సమయంలో కపిల్‌లా కనిపిస్తున్న వ్యక్తి వెనక్కు చూస్తూ ఏవో సైగలు చేస్తూ కనిపించాడు.

అయితే ఈ వీడియోలో నిజానిజాలెంతో తేలాల్సి ఉంది. కొందరు ఈ వీడియోను మార్పింగ్ చేశారంటుంటే, మరికొందరు ఇది అడ్వటైజ్‌మెంట్‌ కోసం చేసిన వీడియో అని అంటున్నారు. ఈ వీడియోను భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎక్స్‌లో షేర్‌ చేశాడు. ఈ క్లిప్‌ను నాలా ఇంకెవరైనా అందుకున్నారా అని ప్రశ్నించాడు. ఈ వీడియోలో ఉన్నది కపిల్‌ కాకుడదని అనుకుంటున్నానని.. కపిల్‌ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నానని గంభీర్‌ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Advertisement

Next Story