- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంభీర్‌పై ప్రశంసలు కురిపించిన స్టార్క్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించాడు. ఆట పరంగా గంభీర్ అద్భుతమైన ఆలోచనాపరుడని చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) తరపున గంభీర్‌తో కలిసి స్టార్క్ పనిచేసిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో స్టార్క్ మాట్లాడుతూ.. గంభీర్ వ్యూహాత్మక విధానాన్ని కొనియాడాడు. ‘గంభీర్‌తో కలిసి పనిచేసిన 9 వారాలు అద్భుతమైనవి. ఆట పరంగా గంభీర్ అద్భుతమైన ఆలోచనాపరుడు. అతను ఎప్పుడూ అతను ప్రత్యర్థి గురించే ఆలోచిస్తాడు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలనే చూస్తాడు. గంభీర్ వ్యక్తిగతంగా కాకుండా జట్టు విజయానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు. ప్రతి చిన్న విషయంపై ఫోకస్ పెట్టడం, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, ప్రత్యర్థి బలహీనతలను గుర్తించడం వంటివి ఆటపై అతని అభిరుచిని తెలియజేస్తాయి.’ అని చెప్పుకొచ్చాడు.