సిక్స్‌లు కొట్టడం కాదు దాని నేర్చుకో : ఇషాన్‌ కిషన్‌పై Gambhir కామెంట్స్

by Vinod kumar |   ( Updated:2023-01-30 10:03:06.0  )
సిక్స్‌లు కొట్టడం కాదు దాని నేర్చుకో : ఇషాన్‌ కిషన్‌పై Gambhir కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమవుతున్న ఇషాన్‌ కిషన్‌పై మాజీ క్రికెటర్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిక్స్‌లు కొట్టడం కాదు.. స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకో అంటూ ఇషాన్‌ కిషన్‌పై గంభీర్ మండిపడ్డాడు. గతేడాది బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ చేసిన తర్వాత ఇషాన్ కిషన్ ను అందరూ అతని కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని భావించారు. కానీ తర్వాత తనకు వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా ఇషాన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఇండియా గెలిచినా.. ఇషాన్ మాత్రం కేవలం 4 పరుగులే చేశాడు.

ఈ మ్యాచ్‌లో అతడు విఫలమైన తర్వాత మాజీ క్రికెటర్ గంభీర్ సంచలన కామెంట్స్ చేశాడు. భారీ షాట్లు ఆడటం సులువే కానీ.. స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకోవాలని గంభీర్ సూచించాడు. అంతేకాదు ఇషాన్ స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. "స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంపై ఇషాన్ చాలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ తొలి 6 ఓవర్లలోనే అతనిపై స్పిన్‌ను ప్రయోగిస్తారు. ఫాస్ బౌలింగ్‌ను అతడు బాగానే ఆడుతున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో ఆడటం ఎంత త్వరగా నేర్చుకుంటే అతనికి అంత మంచిదని గంభీర్ సూచించాడు.

Advertisement

Next Story