- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిల్‌పై రోహిత్ ఫైర్.. తప్పెవరిది?
దిశ, స్పోర్ట్స్ : అఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. 14 నెలల తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతున్న హిట్ మ్యాన్ ఖాతా కూడా తెరవకుండానే రనౌట్ రూపంలో వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రోహిత్ రనౌటయ్యాడు. భారత్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మైదానం వీడుతూ రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. గిల్‌పై నోరు పారేసుకున్నాడు. అయితే, రోహిత్ కోపంతో ఊగిపోవడానికి కారణం ఉంది. ఫజల్హాక్ ఫారూఖీ వేసిన తొలి ఓవర్‌లో రెండో బంతిని రోహిత్ శర్మ మిడాఫ్ దిశగా షాట్ ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న ఇబ్రహీమ్ జద్రాన్ డైవ్ చేసి మరీ బంతిని ఆపాడు. జద్రాన్ బంతిని విసిరే లోపే రోహిత్ రన్ పూర్తి చేశాడు. అయితే, నాన్‌స్ట్రైకర్ శుభ్‌మన్ గిల్ మాత్రం బంతినే చూస్తూ అక్కడే ఉండిపోయాడు. దీంతో జద్రాన్ బంతిని వికెట్ కీపర్ గుర్బాజ్‌కు విసరగా.. అతను వికెట్లను కొట్టేశాడు. దీంతో రోహిత్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది. అయితే, గిల్ వేగంగా పరుగెత్తి ఉంటే రనౌట్ అయ్యేది కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. ఆటలో ఇదంతా సహజమేనని వ్యాఖ్యానించాడు. జట్టు కోసం పరుగులు చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి జరిగితే నిరాశకు గురవుతారని చెప్పాడు.