- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి
దిశ, స్పోర్ట్స్ : ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సింగిల్స్‌లో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. సింగిల్స్ మిగిలిన ఏకైక భారత ఆటగాడు లక్ష్యసేన్ సైతం సెమీస్‌లో ఓడి ఇంటిదారిపట్టాడు. శనివారం రాత్రి జరిగిన సెమీస్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 22-20, 13-21, 11-21 తేడాతో థాయిలాండ్ షట్లర్ కున్లావుట్ విటిద్సర్న్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
గంటా 18 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి గేమ్‌ను అద్భుత ప్రదర్శనతో సొంతం చేసుకున్నాడు. 19-17తో వెనుకబడిన లక్ష్యసేన్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 20-19తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే, ప్రత్యర్థి మరో పాయింట్‌తో స్కోర్లను సమంగా చేయగా వరుసగా రెండు పాయింట్లతో లక్ష్యసేన్ తొలి గేమ్ సాధించాడు. అనంతరం లక్ష్యసేన్ పట్టు కోల్పోయాడు. ప్రత్యర్థి పుంజుకుని దూకుడుగా ఆడటంతో ఒత్తిడిలోకి వెళ్లి అనవసర తప్పిదాలు చేశాడు. దీంతో వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి మ్యాచ్‌ను థాయిలాండ్ ఆటగాడికి సమర్పించుకున్నాడు.