విధ్వంసానికి మారుపేరు వీరేంద్ర సెహ్వాగ్

by Gantepaka Srikanth |
విధ్వంసానికి మారుపేరు వీరేంద్ర సెహ్వాగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్‌‌లో విధ్వంసకర ఆటగాడు ఎవరు? అని ఎవరిని అడిగినా ఏమాత్రం ఆలోచించకుండా వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) అని చెప్పేస్తుంటారు. క్రీజులో ఉన్నంతసేపు అటు ప్రత్యర్థి జట్టుకే కాకుండా సొంత జట్టు సభ్యులకు గుండెపోటు తెప్పించగల దమ్మున్న ఆటగాడు సెహ్వాగ్. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar), శ్రీలంక ఆటగాడు మురళీధరన్‌(Muttiah Muralitharan)ను చూసి వణికిపోతుంటే.. ఆ ఇద్దరి వెన్నులో వణుకు పుట్టించిన వ్యక్తి వీరు. స్వయంగా వారే ‘సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడం కష్టం’ అని చెప్పారంటే ఆయన సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

అలాంటి విధ్వంసకర వీరుడు సెహ్వాగ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో క్రీడాకారులు, ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పోస్టులు, వీడియోలతో సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. కాగా, టీమ్ఇండియా తరఫున సెహ్వగ్ 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 16,119 పరుగులు చేశాడు. అతడి సగటు 41.54 అయితే, అతడి స్ట్రైక్ రేట్ 93.0. ఇక తన కెరీర్‌లో 36 సెంచరీలు 67 అర్ధ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 319. సెహ్వాగ్ 2245 ఫోర్లు, 227 సిక్సర్లు కొట్టాడు.

Advertisement

Next Story

Most Viewed