అక్కడ మ్యాచ్ అంటే వణుకుతున్నారు.. Team Indiaపై Pakistan మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

by Vinod kumar |   ( Updated:2022-09-04 12:41:51.0  )
అక్కడ మ్యాచ్ అంటే వణుకుతున్నారు.. Team Indiaపై Pakistan మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్ 2022లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. మరికొద్ది గంటల్లో ఆసియాకప్‌ 2022లో భాగంగా సూపర్‌-4లో పోటీ పడనున్నాయి. దుబాయ్ వేదికగా గత ఆదివారం ఆగస్టు 28 జరిగిన లీగ్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన భారత్.. మరోసారి అదే వేదికపై గెలిచేందుకు సిద్దమవుతోంది. ఈ మ్యాచ్‌ను ఉద్దేశించి పాక్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ జట్టు దుబాయ్ స్టేడియాన్నే కోరుకుంటుందని.. షార్జా మైదానంలో ఆడేందుకు ఏమాత్రం సిద్ధపడటం లేదన్నాడు. షార్జాలో తమతో ఆడేందుకు భారత జట్టు భయపడుతుందా..? అని ప్రశ్నించాడు. పాకిస్తాన్ టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చలో భాగంగా సికందర్ ఈ ప్రశ్న వేశాడు.

షార్జా వేదికగా 1986లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ జట్టు.. పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఈ విజయంతో పాక్ తొలి ఆసియా కప్‌ను గెలుచుకుంది. పాకిస్థాన్ బ్యాటర్ జావేద్ మియాందాద్ ఆఖరు బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. అయితే భారత్ అక్కడ పెద్దగా మ్యాచ్‌లు ఆడటం లేదు. ప్రస్తుతం ఆసియా కప్‌లో ఇతర జట్లు షార్జాలో ఆడుతున్నాయి. కానీ, టీమిండియా మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగానే జరుగుతుండటం విశేషం.

Advertisement

Next Story