అతడిని అనవసరంగా ఎంపిక చేశారు : Gautam Gambhir

by Vinod kumar |
అతడిని అనవసరంగా ఎంపిక చేశారు : Gautam Gambhir
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఆసియాకప్‌కు ఎంపిక చేయడంపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన కామెంట్స్ చేశాడు. శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేసి సెలెక్టర్లు పెద్ద తప్పు చేశారని.. శార్ధూల్ ఠాకూర్ అరకొర ఆటగాడని, హార్దిక్ పాండ్యా‌కు బ్యాకప్‌గా అతను పనికిరాడని సంచలన కామెంట్స్ చేశాడు. శార్దూల్ ఠాకూర్‌కు బదులు శివమ్ దూబేను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్ 2023 నేపథ్యంలో ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్.. శార్దూల్ ఠాకూర్‌ను కించపరిచేలా మాట్లాడాడు.

'శార్దూల్ ఠాకూర్ అరకొర ఆటగాడు. అతను హార్దిక్ పాండ్యాకు ఏ విధంగానూ బ్యాకప్ కాదు. హార్దిక్ లేని లోటును ఏ మాత్రం తీర్చలేడు. శార్దూల్‌కు బదులు శివమ్ దూబేను సెలెక్టర్లు ఎంపిక చేయాల్సింది. శివమ్ దూబే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లను తన బ్యాటింగ్‌తో గెలిపించాడు. సునాయసంగా సిక్సర్లు బాదగలడు. హార్దిక్ పాండ్యాకు అలాంటి ఆటగాడిని బ్యాకప్‌గా తయారు చేసుకోవాలి. శార్దూల్ ఠాకూర్‌కు వన్డే ప్రపంచకప్ ఆడేంత సీన్ లేదు. అప్పుడప్పుడు ఆడపాదడపా మ్యాచ్‌లు గెలిపించినా.. హార్దిక్ పాండ్యాలా మ్యాచ్ విన్నర్ అయితే కాదు.' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed