రన్ మెషిన్ ఫామ్ అందుకుంటే.. అది ఒక్కరోజుతో పోయేది కాదు : Wasim Jaffer

by Vinod kumar |   ( Updated:2023-01-11 10:15:34.0  )
రన్ మెషిన్ ఫామ్ అందుకుంటే.. అది ఒక్కరోజుతో పోయేది కాదు : Wasim Jaffer
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన కోహ్లీపై మాజీ లెజెండ్ వసీం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కొంత కాలంగా ఫామ్ లేక ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌లో అదరగొట్టిన కోహ్లీ.. తన మూడేళ్ల సెంచరీ కరువు తీర్చుకున్నాడు. కోహ్లీ ఫామ్‌పై మాజీ లెజెండ్ వసీం జాఫర్ స్పందించాడు. కోహ్లీ ఒక్కసారి ఫామ్ అందుకుంటే అది ఒక్కరోజుతో పోయేది కాదని జాఫర్ స్పష్టం చేశాడు. కోహ్లీ కెరీర్‌ను గమనిస్తే.. అతను ఫామ్ ఏళ్ల తరబడి కొనసాగుతుందని అర్థం అవుతుందని చెప్పాడు. కొత్త ఏడాదిని కోహ్లీ సెంచరీతో ప్రారంభించడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. టాప్ ఆర్డర్ సత్తా చాటడంతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. కెప్టెన్ షనక అజేయ శతకంతో రాణించినప్పటికీ.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 67 పరుగుల తేడాతో గెలిచి 1-0 తేడాతో సిరీస్‌లో ముందంజ వేసింది.

Advertisement

Next Story

Most Viewed