IPLలో చెలరేగుతున్న రహానే.. దెబ్బకు టీమిండియాలో చోటు

by Mahesh |   ( Updated:2023-04-26 05:35:22.0  )
IPLలో చెలరేగుతున్న రహానే.. దెబ్బకు టీమిండియాలో చోటు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ టెస్ట్ జట్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానే ఐపిఎల్ 2023 సీజన్‌లో తన అద్భుతమైన ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో చెన్నై జట్టు తరుఫున ఆడుతున్న రహానే చెన్నై జట్టులోకి రెండు మ్యాచుల తర్వాత అనూహ్యంగా స్థానం సంపాదించుకున్నాడు. వచ్చి రాగానే భీకర షార్ట్స్‌తో బౌలర్లపై చెలరేగి ఆడాడు. అలాగే ఈ ఫామ్ ను అలాగే కొనసాగిస్తున్నారు.

దీంతో జూన్ 7 నుంచి లండన్ లోని ఓవల్ లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు రహానేకు చోటు దక్కింది. మంగళవారం బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో రహానేకు చోటు దక్కడంతో అతని అభిమానులు ఆనందంలో మునిగిపోగా.. విశ్లేషకులు మాత్రం.. అతని భీకర ఫామ్‌కు, రహానే కష్టానికి మరోసారి ఫలితం దక్కిందని అంటున్నారు.

Advertisement

Next Story