ఆ ఇద్దరు రాణిస్తే భారత్‌దే T20 వరల్డ్ కప్.. గౌతమ్ గంభీర్(Gautam Gambhir)

by Satheesh |   ( Updated:2022-09-01 14:37:44.0  )
ఆ ఇద్దరు రాణిస్తే భారత్‌దే T20 వరల్డ్ కప్.. గౌతమ్ గంభీర్(Gautam Gambhir)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో గౌతీ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్‌లో భారత విజయ అవకాశాలను టీమిండియా స్టార్ ప్లేయర్స్ బుమ్రా, పాండ్యా నిర్ణయించగలరని.. వాళ్లిద్దరూ రాణిస్తే ఇండియా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలుస్తోందని జోస్యం చెప్పాడు. ఎలాంటి సమయాల్లోనైనా మ్యాచ్‌ను ములుపు తిప్పే సత్తా వారిద్దరికి ఉందని గౌతీ ఆకాశానికెత్తాడు. పాండ్యా, బుమ్రా మ్యాచ్ విన్నర్స్ అని.. వరల్డ్ కప్‌లో వీరు టీమిండియాకు కీలకం కానున్నారని అభిప్రాయపడ్డాడు. ఇక, బుమ్రా అద్భుతమైన బౌలర్ అని.. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగల టాలెంట్ ఉన్న ఆటగాడని కొనియాడాడు. ఐపీఎల్ 2022 నుండి పాండ్యా ఆల్ రౌండర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడని.. ఒంటి చేత్తో భారత్‌కు విజయాలు అందించే సత్తా పాండ్యాకు ఉందని.. అతడో వరల్డ్ క్లాస్ ప్లేయరని గౌతీ ప్రశంసల వర్షం కురిపించాడు.

Advertisement

Next Story