క్రికెట్‌లో నేను చూసిన మోస్ట్ డేంజరస్ ఓపెనర్ అతడే: సునీల్ గవాస్కర్

by Satheesh |
క్రికెట్‌లో నేను చూసిన మోస్ట్ డేంజరస్ ఓపెనర్ అతడే: సునీల్ గవాస్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్‌ను గవాస్కర్ ఆశానికెత్తాడు. క్రికెట్‌లో తాను ఇప్పటి వరకు చూసిన ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అని కొనియాడారు. సెహ్వాగ్ క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు వణుకేనని అన్నారు. సెహ్వాగ్ మొదటి బంతి నుండే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేస్తాడని.. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుండి ఔట్ అయ్యే వరకు ఒకటే రిథమ్‌లో ఆడుతాడని పేర్కొన్నారు. వీరేంద్ర సెహ్వాగ్ ఒంటి చేత్తో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని గుర్తు చేశారు. సెహ్వాగ్ సెంచరీ చేసే సమయంలో కూడా అదే దూకుడుగా అడుతాడని.. ఎన్నడు అతడు వ్యక్తిగత రికార్డ్‌ల కోసం ఆడలేదని తెలిపారు.

Advertisement

Next Story