బుమ్రాను టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్.. అతనికి అహంకారం పెరిగిపోయిందంటూ ఫైర్.. కారణం ఏంటంటే?

by Harish |
బుమ్రాను టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్.. అతనికి అహంకారం పెరిగిపోయిందంటూ ఫైర్.. కారణం ఏంటంటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాలో తానే ఫిట్టెస్ట్ ప్లేయర్ అని స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా తెలిపాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న బుమ్రాను ‘భారత క్రికెటర్లలో ఫిట్టెస్ట్ ప్లేయర్ ఎవరు? అని అడిగారు. దానికి బుమ్రా ఆసక్తికర సమాధానమిచ్చాడు. తానే ఫిట్టె్స్ట్ అని బదులిచ్చాడు. ‘మీరు వెతుకుతున్న సమాధానం నాకు తెలుసు. కానీ, నేను ఫాస్ట్ బౌలర్‌ను కాబట్టి నా పేరు చెప్పాలనుకుంటున్నా. ఫాస్ట్ బౌలర్‌గా మన దేశ పరిస్థితుల్లో రాణించడం అంత సులభం కాదు. కాబట్టి, నేను ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్లనే ప్రమోట్ చేస్తా. ఫిట్టెస్ట్ ప్లేయర్‌గా వారి పేరునే చెబుతా.’ అని తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. బుమ్రా సమాధానంపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టీమిండియాలోనే కాదు వరల్డ్ క్రికెట్‌లోనే ఫిట్టెస్ట్ క్రికెటర్ ఎవరంటే కోహ్లీనే గుర్తొస్తాడని, బుమ్రాకు అహంకారం పెరిగిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story