- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతా ఫేక్.. టీ20 వరల్డ్ కప్ పై వస్తున్న రూమర్లు కొట్టిపారేసిన హిట్ మ్యాన్
దిశ, స్పోర్ట్స్: టీ20 ప్రపంచకప్ ఆటగాళ్ల ఎంపికపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్ మధ్యలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ లను తాను కలిశానన్న వార్తలను ఖండించాడు. ద్రావిడ్, అజిత్ అగార్కర్ లతో ముంబైలో రెండు గంటల పాటు రోహిత్ శర్మ భేటీ అయ్యాడని వార్తలు వచ్చాయి. టీ20 ప్రపంచకప్ లో హార్దిక్ పాండ్యాను తీసుకోవాలంటే కచ్చితంగా బౌలింగ్ చేయాలని.. రోహిత్ తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేస్తారని.. ఆమీటింగ్ లో చర్చించనట్లు సమాచారం అందింది. అయితే, ఆ వార్తలన్నీ ఫేక్ అని కొట్టిపారేశాడు హిట్ మ్యాన్.
క్లబ్ ప్రైరీ ఫైర్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఆ వార్తన్నీ పుకార్లే అని తేల్చేశాడు రోహిత్ శర్మ. అదంతా ఫేక్ న్యూస్ అని తెలిపాడు. తన నుంచి గానీ, రాహుల్ లేదా అజిత్ అగార్కర్ లేదా బీసీసీఐ నుంచి నేరుగా రాని ఏ ప్రకటనను నమ్మవద్దని క్రికెట్ ఫ్యాన్స్ ని కోరాడు.
తాను ఎవరినీ కలవలేదని.. అజిత్ అగార్కర్ ఎక్కడో దుబాయ్‌లో గోల్ఫ్ ఆడుతున్నాడని కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. రాహుల్ బెంగళూరులో తన పిల్లలు క్రికెట్ ఆడటం చూస్తున్నాడని తెలిపాడు. అసలు వాళ్లెవరూ సమావేశం కాలేదని స్పష్టం చేశాడు.
ఇక హార్దిక్ విషయానికి వస్తే.. ఐపీఎల్ ఈ సీజన్ లో ముంబైకి కెప్టెన్ గా రోహిత్ స్థానంలోకి వచ్చాడు ఈ ఆల్ రౌండర్. కానీ, హార్దిక్ ఫాం మాత్రం ఆందోళనకరంగా ఉంది. కంటిన్యూగా బౌలింగ్ చేయట్లేదు. ఈసీజన్ లో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసి.. ఓవర్ కు 12 కంటే ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడు. ఇక, కోహ్లీ విషయానికి వస్తే.. ప్రత్యర్థులపై బ్యాట్ తో విరుచుకుపడుతున్నాడు. ఐపీఎల్ పరుగుల చార్టులో కోహ్లీయే అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్ భారత జట్టు విషయానికొస్తే.. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో ఆటగాళ్లెవరనే ఉత్కంఠకు తెరపడనుంది.