ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం..

by Vinod kumar |   ( Updated:2023-06-07 10:13:41.0  )
ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌ వెటరన్ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పగా.. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ఈసీబీ మొయిన్‌ను జూన్‌ 16 నుంచి ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌కు ఎంపిక చేసింది.

తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులోని జాక్‌ లీచ్‌ గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మొయిన్‌ను రిటైర్మెంట్‌ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఈసీబీ కోరింది. దీంతో అందుకు అతను అంగీకరించాడు. ఈసీబీ మొయిన్‌ అలీపై నమ్మకంతో రిటైర్మెంట్‌ను సైతం వెనక్కు తీసుకునేలా చేసి, జట్టులోకి ఆహ్వానించింది. కెరీర్‌లో ఇప్పటివరకు 64 టెస్ట్‌లు ఆడిన మొయిన్‌.. 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు.

Advertisement

Next Story