శ్రీలంక క్రికెట్లో డోపింగ్ కలకలం

by M.Rajitha |
శ్రీలంక క్రికెట్లో డోపింగ్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీలంక క్రికెట్లో డోపింగ్ కలకలం రేగింది. లంక వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించడంటూ ఆ దేశ క్రికెట్ బోర్డ్ సస్పెండ్ చేసింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా డిక్వెల్లా అన్ని రకాల మ్యాచ్ లనుండి సస్పెండ్ చేయబడతాడాని లంక బోర్డు ఓ ప్రకటన జారీ చేసింది. ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ లో ప్రపంచ డోపింగ్ నిరోధక మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిన పరీక్షలో డిక్వెల్లా విఫలం అయ్యాడు. కాగా ఎంతకాలం ఈ నిషేధం ఉంటుంది అనే దానిపై మరో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డిక్వెల్లా నాయకత్వంలో ఇటీవల లంక ప్రీమియర్ లీగ్ లో తన గాలే జట్టును అగ్రస్థానంలో నిలిపాడు.

Next Story

Most Viewed