- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మూవీ చూసి ఎంజాయ్ చేయండి కానీ తప్పొప్పులపై రివ్యూలు కాదు.. సూర్య సెన్సేషనల్ కామెంట్స్!

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా, ‘మెయ్యజగన్’ మూవీకి సంబంధించిన ఓ ఈవెంట్‌లో ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘‘సినీ ప్రియులు ఎవరైనా సరే సినిమా చూడండి ఎంజాయ్ చేయండి. అంతేకానీ కథ, కథనం, ఎమోషన్స్, కామెడీ, మ్యూజిక్ ఇలా అన్నింటిని చూడండి, బాక్సాఫీసు కలెక్షన్స్ గురించి ఆలోచించకండి. ఒక అభిమానిగా మూవీని సెలబ్రేట్ చేసుకోండి.
ఎంజాయ్ చేయండి కానీ అందులోని తప్పొప్పులు వెతికి నెగిటివ్ రివ్యూ ఇవ్వడంపై దృష్టి పెట్టకండి’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా, మెయ్య జగన్ మూవీ విషయానికొస్తే.. కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించగా.. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. అయితే ఇదే చిత్రాన్ని ‘సత్యం సుందరం’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.