- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
World Chess Championship 2024 : డింగ్ లిరెన్‌పై రష్యా సమాఖ్య సంచలన ఆరోపణలు
దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ ఫలితంపై రష్యా చెస్ సమాఖ్య చీఫ్ ఆండ్రీ ఫిలటోవ్ సంచలన ఆరోపణలు చేశాడు. డింగ్ లిరెన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయాడన్నాడు. దీనిపై అంతర్జాతీయ చెస్ సమాఖ్య విచారణ చేయాలని డిమాండ్ చేసినట్లు శుక్రవారం రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది. ‘చివరి గేమ్ రిజల్ట్ నిపుణులు, చెస్ అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది. నిర్మయాత్మక గేమ్‌లో చైనీస్ ఆటగాడు డింగ్ లిరెన్ ఆటతీరు అనుమానాస్పదంగా ఉంది. దీనిపై అంతర్జాతీయ చెస్ సమాఖ్య వెంటనే దర్యాప్తు చేయాలి. టాప్ ప్లేయర్ డింగ్ లిరెన్ తాను ఉన్న పొజిషన్‌లో ఓడిపోవడం అసాధ్యం. ఈ గేమ్‌లో అతను ఓడిపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉద్దేశపూర్వకంగానే లిరెన్ ఓడిపోయినట్లు అనుమానాలున్నాయి.’ అని ఆయన అన్నారు. నాలుగు గంటలకు పైగా సాగిన చివరి గేమ్ 58 ఎత్తుల్లో ముగిసింది. దీంతో 7.5-6.5 పాయింట్లతో గుకేష్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.