‘One Nation, One Election’: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
‘One Nation, One Election’: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: One Nation.. One Election జమిలి ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. జమిలీ అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు.

ఆ పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed