నా భార్యకు చెప్పలేదు.. నా ఫస్ట్ రియాక్షన్ అదే : భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్

by Harish |
నా భార్యకు చెప్పలేదు.. నా ఫస్ట్ రియాక్షన్ అదే : భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్‌గా నియామకమైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం చెన్నయ్‌లో భారత జట్టు శిక్షణ ప్రారంభించగా మోర్కెల్ జట్టుతో చేరాడు. తాజాగా మోర్కెల్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియోలో అతను భారత కోచ్‌గా అవకాశం రావడంపై స్పందించాడు. భారత జట్టుతో కలిసి పనిచేయాలని బీసీసీఐ నుంచి వార్త అందగానే తాను ఐదు నిమిషాలు అలాగే ఉండిపోయానని తెలిపాడు. ‘ఐదు నిమిషాల్లో నా రూంలోని కూర్చండిపోయా. ఈ విషయం ముందుగా మా నాన్నకు చెప్పా. సాధారణంగా భార్యకు చెబుతారు. కానీ, నేను మా నాన్నతో పంచుకున్నాడు. క్రికెట్ అభిమానిగా ఆ క్షణాన్ని ఆస్వాదించాలనుకున్నా. ఐదారు నిమిషాలు ఎంజాయ్ చేశా. ఆ తర్వాత నా కుటుంబసభ్యులతో పంచుకున్నా.’ అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story