- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోని కెప్టెన్సీ మహా చిరాకు.. రాబిన్ ఊతప్ప
దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని కి ఉన్న ఫాలోయింగ్ అనన్య సామాన్యం. ముఖ్యంగా అతనికి కెప్టెన్సీకి ఫీదా అయిన ప్రత్యర్థి జట్లు కోకొల్లలు. ఓ అనామక క్రికెటర్ గా టీమిండియాలో అడుగుపెట్టిన ధోని అత్యుత్తమ ఆట తీసురతో కెప్టెన్సీ చేజిక్కించుకున్నాడు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎవ్వరికి సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు భారత జట్టుకు సంపాదించి పెట్టాడు. అదేవిధంగా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఆ జట్టుకు నాలుగు సార్లు టైటిల్ అందించాడు.
ధోని మైదానంలో ఎప్పుడు అగ్రసీవ్ గా రియాక్ట్ అవ్వడు. ఎంతో కూల్ గా ఉంటూ ప్రత్యర్ధులతో మైండ్ గేమ్ ను గమనిస్తూ.. ఆశ్చర్యకర నిర్ణయాలతో ఎత్తుకు పైత్తులు వేసి ప్రత్యర్థుల్లో దడ పట్టిస్తాడు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప సైతం ధోని కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కెప్టెన్సీ ఎదుర్కోవడం మహా చిరాకు అని తెలిపాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ జరిగినప్పుడల్లా కూడా ఎంతో చిరాకుగా అనిపించేది.
ఒక మ్యాచ్ లో హేజిల్ వుడ్ బౌలింగ్ చేస్తుండగా ఫైన్ లెగ్ వైపు ఫీల్డర్లు లేని తెలిపాడు. తాను బంతి అవుట్ సైడ్ ఆఫ్ వైపు పడుతుందని అంచనా వేశానన్నాడు.దీంతో బంతిని డీప్ ఫైన్ లెగ్ కు కొట్టి బౌండరీగా మలిచేందుకు ప్రయత్నాలు చేశానని, కానీ మనకు అలవాటు లేని ప్రాంతంలో షాట్ కొట్టేలా ధోని పరిస్థితులను సృష్టించాడని తెలిపాడు. అలా బ్యాట్స్ మెన్ మైండ్ తో ధోని ఆడుకుంటూ ఉంటాడని రాబిన్ తెలిపాడు. ధోని ఎక్కడైతే ఫీల్డ్ సెట్ చేస్తాడో.. సరిగ్గా అక్కడికే బ్యాట్స్ మెన్ బంతిని కొడతాడని తెలిపాడు. దీంతో క్యాచ్ ఇచ్చి బ్సాట్స్ మెన్ అవుట్ అవుతూ ఉంటారని.. అందుకే నాకు ధోని కెప్టెన్సీ అంటే మహా చిరాకని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.