- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Keerthi suresh: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌తో స్టార్ హీరోయిన్ పెళ్లి.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన మహానటి
దిశ, సినిమా: ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’, ‘దసరా’ చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో కీర్తి సురేష్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
గత రెండేళ్ల నుంచి హీరోయిన్ కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రేమించుకుంటున్నారని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నారని, వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే పుకారు నెట్టింట షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం వీళ్లిద్దరు కలిసి ఇటీవల అనేక ప్రైవేట్ పార్టీలలో కనపడడమే. అయితే ఈ వార్త బాగా వైరల్ కావడంతో కీర్తి సురేష్ దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక దీనిపై ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని చూసి మా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. నేను అనిరుద్‌తో ప్రేమలో లేను, అతినికి నాకు పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది పూర్తిగా ఫేక్. నాకు అనిరుద్ మంచి స్నేహితుడు, అది మాత్రం ఒప్పుకుంటాను. ప్రస్తుతం నాకు పెళ్లి పై ఆసక్తి లేదు. నా దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉంది’ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. దీంతో ఇన్ని రోజులుగా నెట్టింట ప్రచారమైన రూమర్స్‌కి చెక్ పడినట్లు అయింది.