Deodhar Trophy 2023: క్రికెట్‌ చరిత్రలోనే స్టన్నింగ్ క్యాచ్‌.. చూస్తే మైండ్‌ బ్లాంక్‌.. వీడియో వైరల్‌

by Vinod kumar |
Deodhar Trophy 2023: క్రికెట్‌ చరిత్రలోనే స్టన్నింగ్ క్యాచ్‌.. చూస్తే మైండ్‌ బ్లాంక్‌.. వీడియో వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవాళీ వన్డే టోర్నీ దియోదర్‌ ట్రోఫీ జూన్‌ 24 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా సోమవారం సౌత్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్, పంజాబ్‌ వికెట్‌ కీపర్‌ ప్రభ్‌ సిమ్రాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. సౌత్‌జోన్‌ బ్యాటర్‌ రిక్కీ భుయ్‌ను అద్భుతమైన క్యాచ్‌తో ప్రభ్‌ సిమ్రాన్‌ పెవిలియన్‌కు పంపాడు. సౌత్‌ జోన్‌ ఇన్నింగ్స్‌ 39 ఓవర్‌ వేసిన మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రెండో బంతిని రిక్కీ భుయ్‌ ర్యాంప్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

ఈ సమయంలో మొదటి స్లిప్‌ దిశగా వెళ్తున్న బంతిని వికెట్‌ కీపర్‌ ప్రభ్‌ సిమ్రాన్ కుడివైపు డైవ్‌ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. అది చూసిన బ్యాటర్‌తో పాటు మిగితా ఆటగాళ్లందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్‌ ఆసియాకప్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో ప్రభు సిమ్రాన్‌ భాగంగా ఉన్నాడు.

అదే విధంగా వచ్చే నెలలో జరగనున్న ఆసియాక్రీడల్లో భారత సీనియర్‌ జట్టు తరపున ప్రభ్‌ సిమ్రాన్ పాల్గొనున్నాడు. ఈ జట్టుకు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సారధ్యం వహించనున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. నార్త్‌జోన్‌పై 185 పరుగుల భారీ తేడాతో సౌత్‌ జోన్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌత్‌జోన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.

Advertisement

Next Story

Most Viewed