YS Sharmila: జగన్ ఆ పార్టీకి దత్త పుత్రుడిలా మారారు.. వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-10-21 11:00:42.0  )
YS Sharmila: జగన్ ఆ పార్టీకి దత్త పుత్రుడిలా మారారు.. వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుపేద కుటుంబాల్లో పుట్టి ఉన్నత చదువులు చదివే స్థోమత లేక మధ్యలోనే చదువు మానేస్తున్న విద్యార్థినీ, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పథకం ద్వారాలో ఎంతోమంది ఇంజినీర్లు, డాక్టర్లు తయారయ్యారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఆమె తన సోదరుడు మాజీ సీఎం జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

దాదాపు ఐదేళ్ల జగన్ పాలనలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3,500 కోట్లను పెండింగ్ పెట్టారని ఆరోపించారు. వారి బకాయిలు చెల్లించకుండా నిరుపేద విద్యార్థులు జీవితాలతో ఆటాడుకున్నారని ఫైర్ అయ్యారు. అధికారం, అక్రమార్జనపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై చూపలేదని ఆక్షేపించారు. ఒకప్పుడు తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మతతత్వ పార్టీ అయిన బీజేపీని తీవ్రంగా వ్యతరేకించారని గుర్తు చేశారు. కానీ నేడు అదే పార్టీతో జగన్ అంటకాగుతూ.. ప్రధాని నరేంద్ర మోడీకి దత్తపుత్రిడిలా మారారని ఆరోపించారు. నాడు ఐదేళ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పోయిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అదేవిధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed