Tania Sachdev : దిగొచ్చిన ఢిల్లీ సర్కార్..తానియా సచ్ దేవ్ తో సీఎం అతిషి భేటీ!

by Y. Venkata Narasimha Reddy |
Tania Sachdev : దిగొచ్చిన ఢిల్లీ సర్కార్..తానియా సచ్ దేవ్ తో సీఎం అతిషి భేటీ!
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ తరుపున, దేశం కోసం 2008 నుంచి ఆడి తాను పతకాలు తీసుకొస్తే ఇక్కడి ప్రభుత్వం తనను గుర్తించలేదని చెస్‌ క్రీడాకారిణి (Chess player) తానియా సచ్‌దేవ్‌ (Tania Sachdev) సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేయడం విదితమే.దీంతో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎందుకొచ్చిన ఇబ్బంది అనుకున్నారేమో ఏమోగాని ఢిల్లీ సీఎం అతిషి(Delhi CM Atishi)వెంటనే స్పందించారు. రోజు వ్యవధిలోనే తానియాను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. తానియాతో సమావేశం అద్భుతంగా జరిగిందని, తానియా సచ్‌దేవ్‌ భావితరం చెస్‌ క్రీడాకారులకు ఆదర్శమని సీఎం అతిషి ప్రశంసించారు. ఢిల్లీలో చెస్‌ను ప్రమోట్‌ చేయడంపై ఆమె తనతో కొన్ని ముఖ్యమైన అంశాలను పంచుకున్నారని అతిషి తెలిపారు.

తానియాతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని, ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు చెస్‌ నేర్పించడానికి సచ్‌దేవ్‌ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో చెస్‌ను ప్రమోట్‌ చేయడానికి సంబంధించి ఆమె కొన్ని సమస్యలను తానియా తన దృష్టికి తీసుకొచ్చారని, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అతిషి తెలిపారు.

Advertisement

Next Story