ఢిల్లీ క్యాపిటల్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో ఆటగాడు ఔట్

by Harish |
ఢిల్లీ క్యాపిటల్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో ఆటగాడు ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ సీజన్‌కు దూరమవ్వగా తాజాగా పేసర్ లుంగి ఎంగిడి కూడా అందుబాటులో ఉండటం లేదు. సౌతాఫ్రికాకు చెందిన లుంగి ఎంగిడి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైనట్టు ఐపీఎల్ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. 2022 వేలంలో లుంగి ఎంగిడిన ఢిల్లీ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, అతను ఆ సీజన్‌తోపాటు గతేడాది కూడా లీగ్‌కు అందుబాటులో లేడు. ఈ సీజన్‌లో అతని స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియా స్పిన్ ఆల్‌రౌండర్ జేక్ ఫ్రెజర్-మెక్‌గుర్క్‌ను భర్తీ చేసింది. కనీస ధర రూ. 50 లక్షలకు అతన్ని జట్టులోకి తీసుకుంది. జేక్ ఫ్రెజర్-మెక్‌గుర్క్‌ గత నెలలో వెస్టిండీస్‌పై వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఆసిస్ తరపున రెండు వన్డేలు ఆడిన అతను 51 పరుగులు చేశాడు. కాగా, ఐపీఎల్-2024లో ఈ నెల 23న పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది.

Advertisement

Next Story