- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US Open : డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్‌కు షాక్.. ప్రీక్వార్టర్స్‌లోనే ఔట్
దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్ ఆసక్తికరంగా సాగుతోంది. పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్ రేసులో ఉన్న ప్లేయర్లు ఒక్కొక్కరుగా ఇంటిదారిపడుతున్నారు. మెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్, అల్కరాజ్ పరాజయం పాలవ్వగా.. తాజాగా ఉమెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ కూడా నిష్ర్కమించింది. ప్రీక్వార్టర్స్‌లో ఆమెకు అమెరికాకే చెందిన ఎమ్మా నవారో షాకిచ్చింది.
యూఎస్ ఓపెన్‌లో ఉమెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, అమెరికా స్టార్ కోకో గాఫ్ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సహచర క్రీడాకారిణి నవారో చేతిలోనే పరాజయం పాలైంది. ఆసక్తికరంగా సాగిన ప్రీక్వార్టర్స్‌లో గాఫ్‌ను 6-3, 4-6, 6-3 తేడాతో ఓడించిన నవారో యూఎస్ ఓపెన్‌లో తొలిసారిగా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్‌లో గాఫ్ 19 డబుల్ ఫౌల్ట్స్, 60 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం.
గాఫ్ పొరపాట్లను సద్వినియోగం చేసుకున్న నవారో రెచ్చిపోయింది. 20 విన్నర్లు బాదిన ఆమె 4 సార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసింది. తొలి సెట్ నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లిన ఆమెకు రెండో సెట్‌లో గాఫ్ పుంజుకోవడం పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో సెట్‌ను కోల్పోయినప్పటికీ మూడో సెట్‌లో దూకుడుగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు, గతేడాది ఫైనలిస్ట్ సబలెంక కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రీక్వార్టర్స్‌లో ఆమె 6-2, 6-4 తేడాతో ఎలిస్ మెర్టెన్స్(బెల్జియం)ను ఓడించి టోర్నీలో టైటిల్ దిశగా సాగుతోంది. అలాగే, పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ క్విన్వెన్ జెంగ్ కూడా అదరగొడుతున్నది. నాలుగో రౌండ్‌లో 7-6(7-2), 4-6, 6-2 తేడాతో డొన్నా వెకిక్(క్రోయేషియా)పై నెగ్గి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
జ్వెరెవ్, టియాఫో ముందుకు
మెన్స్ సింగిల్స్‌లో 4వ సీడ్ జ్వెరెవ్(జర్మనీ) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ప్రీక్వార్టర్స్‌లో అమెరికా ప్లేయర్ నకషిమాను 3-6, 6-1, 6-2, 6-2 తేడాతో ఓడించాడు. తొలి సెట్ కోల్పోయిన తర్వాత బలంగా పుంజుకున్న జ్వెరెవ్ వరుసగా మూడు సెట్లను నెగ్గి ముందంజ వేశాడు. అమెరికా సంచలనం ఫ్రాన్సెస్ టియాఫో 6-4, 7-6(7-3), 2-6, 6-3 తేడాతో పాపిరిన్(ఆస్ట్రేలియా)పై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మూడో రౌండ్‌లో పాపిరిన్.. జకోకు షాకిచ్చిన విషయం తెలిసిందే.