MS ధోని రిటైర్మెంట్‌పై ప్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన దీపక్ చాహర్

by Mahesh |   ( Updated:2023-03-20 05:38:29.0  )
MS ధోని రిటైర్మెంట్‌పై ప్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన దీపక్ చాహర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ లో కింగ్ మేకర్ ఉన్న ధోని అన్ని ఇంటర్నేషనల్ ఫార్మట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా అతని అభిమానుకోసం ధోని ఐపీఎల్ నుంచి మాత్రం రిటైర్మెంట్‌ తీసుకొలేదు. అయితే ధోనికి 2023 ఐపీఎల్ సీజనే చివరిది అని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అనేక మంది ధోని రిటైర్మెంట్ పై రకరకాలుగా చర్చించుకున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫాస్ట్ బౌలర్ అయిన దీపక్ చాహర్ ధోని రిటైర్మెంట్ వార్తలపై స్పందించాడు.

"ఇది అతని చివరి సంవత్సరం అని ఎవరూ చెప్పలేదు. కనీసం, అతను లేదు. అతను మరింత ఆడతాడని ఆశిస్తున్నాను. మాకు అలాంటిదేమీ తెలియదు, అతను వీలైనంత ఎక్కువగా ఆడాలని మేము కోరుకుంటున్నాము, ”అని చాహర్ న్యూస్ ఇండియా స్పోర్ట్స్‌తో అన్నాడు. అలాగే CSK కెప్టెన్ ధోని మంచి ఫామ్‌లో ఉన్నాడు.. అతను ఈ సీజన్‌లో ఎప్పుడు బ్యాటింగ్ చేస్తాడో చూద్దాం. రిటైర్‌మెంట్ ప్లాన్‌ల విషయానికి వస్తే, అతను అనుకున్నప్పుడు తీసుకుంటాడని పేసర్ దీపక్ చాహర్ చెప్పాడు.

Advertisement

Next Story