డేవిడ్‌ వార్నర్‌ రిటైర్మెంట్‌‌పై హింట్ ఇచ్చిన భార్య క్యాండిస్‌..

by Vinod kumar |
డేవిడ్‌ వార్నర్‌ రిటైర్మెంట్‌‌పై హింట్ ఇచ్చిన భార్య క్యాండిస్‌..
X

సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫ్యూచర్ ప్లాన్‌కు సంబంధించి అతడి భార్య క్యాండిస్‌ ఇన్ స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది. "టెస్ట్‌ క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. ఈ ప్రయాణం చాలా సరదాగా ఉండింది. చిరకాలం నీ అతి పెద్ద మద్దతుదారులు.. నీ గర్ల్‌ గ్యాంగ్‌.. లవ్‌ యూ వార్నర్‌" అని ఆ పోస్ట్‌లో క్యాండిస్‌ రాసుకొచ్చింది. ఇందులో తమ కుటుంబం మొత్తం ఉన్న ఒక ఫోటోను క్యాండిస్‌ షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌ వార్నర్‌ టెస్ట్‌ క్రికెట్‌ రిటైర్మెంట్‌‌కు సంకేతమనే టాక్ వినిపిస్తోంది.

దీంతో యాషెస్‌ నాలుగో టెస్ట్‌ ఆడకుండానే వార్నర్‌ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అభిమానులు అనుకుంటున్నారు. ఇకపై ఎలాగూ ఆస్ట్రేలియా టీమ్‌లో చోటు దక్కదని తెలిసి వార్నర్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రీ పోన్‌ చేసుకున్నాడని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి నాలుగో టెస్ట్‌ ప్రారంభానికి ముందు వార్నర్‌ ఏం ప్రకటన చేస్తాడో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి.

Advertisement

Next Story