- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అమరన్’ తెలుగు ట్రైలర్ విడుదల.. ఎమోషనల్ డైలాగ్స్‌తో అదరగొట్టిన సాయిపల్లవి, శివకార్తికేయన్
దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi), కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Shiva Karthikeyan) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’(Amaran). మేజర్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)తెరకెక్కిస్తున్నారు. దీనిని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) నిర్మిస్తున్నారు. అయితే ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ పాత్రలో నటిస్తుండగా.. సాయి పల్లవి రెబెకా వర్గీస్‌గా కనిపించబోతుంది.
ఇందులోంచి ఇటీవల విడుదల ‘మిన్నలే’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ‘అమరన్’ (Amaran)సినిమా అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ‘అమరన్’ (Amaran)తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఇందులో సాయి పల్లవి, శివకార్తికేయన్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా వీరిద్దరి కెమిస్ట్రీ అభిమానులను ఫిదా చేస్తుంది.