గద్వాల జిల్లా నిరుద్యోగులకు శుభవార్త..

by Naveena |
గద్వాల జిల్లా నిరుద్యోగులకు శుభవార్త..
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : గద్వాల జిల్లా ఆసుపత్రి, సి హెచ్ సి అలంపూర్‌ లలో వైద్యాధికారుల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆసుపత్రి జోగులాంబ గద్వాల, సి హెచ్ సి అలంపూర్‌లో సి ఏ ఎస్ (ఎస్ పి ఎల్) జనరల్ మెడిసిన్ (3), సి ఏ ఎస్ (ఎస్ పి ఎల్) జనరల్ సర్జన్ (2), సి ఏ ఎస్ (ఎస్ పి ఎల్) గైనకోలోజిస్ట్ (4), సి ఏ ఎస్ (ఎస్ పి ఎల్) అనస్థేషియా (2), అలంపూర్‌లో జీడిఎంఓ (2) పోస్టుల భర్తీ కొరకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించబడుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 25 నుంచి 26 వరకు రెండు రోజుల పాటు నిర్వహించబడే ఈ ఇంటర్వ్యూలో పొల్గొనలన్నారు. ఎంపిక ప్రక్రియ గద్వాల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్‌లో జరుగుతుందని తెలిపారు.

Advertisement

Next Story