- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిటైర్మెంట్ వేళ ఆ బౌలర్‌పై వార్నర్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నింగ్ ప్రపంచ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం తొలి రోజునే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల వన్డే ప్రపంచకప్ 2023 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న డేవిడ్ వార్నర్.. తాజాగా ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆటకు ముగింపు పలకడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు వార్నర్ వెల్లడించాడు. తన నిర్ణయంతో కొత్త ప్లేయర్లకు అవకాశాలు వస్తాయని వార్నర్ చెప్పుకొచ్చాడు. వార్నర్ ఇటీవలె టెస్టు ఫార్మాట్‌కు సైతం వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ఒకవేళ 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్ అవసరం అయితే మాత్రం తాను రీఎంట్రీ ఇస్తానని వార్నర్ చెప్పారు. ఇదిలా ఉండగా.. రిటైర్మెంట్ వేళ ఓ మీడియా ప్రతినిధి వార్నర్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. కెరీయర్‌లో ఎదుర్కొన్న బౌలర్లలో ఎవరి బౌలింగ్‌లో కష్టంగా అనిపించిందని రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి వార్నర్ స్పందిస్తూ.. 2016-2017 సీజన్‌లో పెర్త్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డేల్ స్టెయిన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తాను, షాన్ మార్ష్ భయపడ్డామని తెలిపారు. మ్యాచ్ కోసం మైదానంలో దిగాక.. స్టెయిన్ చాలా సీరియస్‌గా ఉంటారని.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నవ్వేందుకు ప్రయత్నం కూడా చేయబోరని చెప్పుకొచ్చారు. జట్టును గెలిపించేందుకు 100 శాతం కష్టపడుతారని అన్నారు.