- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియాకు మరో షాక్.. గాయంతో వార్నర్ దూరం
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు మరో దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. హెయిర్ లైన్ గాయం కారణంగా అతడు తదుపరి జరగనున్న రెండు టెస్టులకు దూరం కానున్నాడు. ఇప్పటికే భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో తాజాగా డేవిడ్ వార్నర్ దూరం కావడం ఆసీస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయింది.
దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 36 ఏళ్ల వార్నర్‌కు నిమిషాల వ్యవధిలోనే రెండు గాయాలయ్యాయి. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బంతి వార్నర్ మోచేతికి తాకింది. తాజాగా గాయం నుంచి కోలుకోక పోవడంతో వార్నర్ మిగిలిన రెండు టెస్టులకు దూరం కానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మార్చి 17 నుంచి 22 వరకు జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు వార్నర్ తిరిగి వస్తాడని స్పష్టం చేసింది.