సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..

by Vinod kumar |
సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌కి ముందు టైటిల్ గెలవలేకపోయిన ఫ్రాంఛైజీలన్నీ కోచ్‌లను మార్చే పనిలో పడ్డాయి. ఆర్‌సీబీ కొత్త కోచ్‌గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు తీసుకోగా లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా హెడ్ కోచ్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, మాజీ ఆల్‌రౌండర్ డేనియల్ వెట్టోరీని హెడ్ కోచ్‌గా నియమించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

డానియల్ వెట్టోరీకి స్వాగతం పలికిన ఆరెంజ్ ఆర్మీ, బ్రియాన్ లారాకి వీడ్కోలు తెలిపింది. ‘బ్రియాన్ లారాతో రెండేళ్ల అనుబంధం ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మీరు చేసిన సేవలకు థ్యాంక్యూ..’ అని రాసుకొచ్చింది ఎస్‌ఆర్‌హెచ్. డేనియల్ వెట్టోరీ ఇంతకుముందు 2014 నుంచి 2018 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2016లో డేనియల్ వెట్టోరీ కోచింగ్‌లోనే ఫైనల్‌కి చేరింది రాయల్ ఛాలెంజర్స్.

2016 ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి, మొట్టమొదటి టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి 2024 సీజన్‌లో కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు డేనియల్ వెట్టోరీ. 2021-23 మధ్య మూడు సీజన్లలో రెండు సార్లు ఆఖరి పొజిషన్‌లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని 8వ స్థానంలో నిలిచింది. వరుసగా 5 మ్యాచుల్లో నెగ్గిన తర్వాత వరుసగా 6 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ చేరలేకపోయింది ఆరెంజ్ ఆర్మీ.

Advertisement

Next Story

Most Viewed