Himanshu Pathak: ఇక్రిశాట్ నూతన డైరెక్టర్ జనరల్‌గా హిమాన్షు పాఠక్

by Shiva |
Himanshu Pathak: ఇక్రిశాట్ నూతన డైరెక్టర్ జనరల్‌గా హిమాన్షు పాఠక్
X

దిశ, వెబ్‌డెస్క్: ICRISAT నూతన డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్ హిమాన్షు పాఠక్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయ పరిశోధన, విద్యా‌శాఖ (DARE) కార్యదర్శిగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ( ICAR ) డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. ఇక్రిశాట్‌ ఆవిర్భావం తరువాత డీజీగా నియమితులైన తొలి భారతీయుడిగా హిమాన్షు పాఠక్‌ చరిత్ర సృష్టించారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, న్యూఢిల్లీ నుంచి సాయిల్ సైన్స్, అగ్రికల్చరల్ కెమిస్ట్రీలో, న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ పూర్తి చేశారు.

వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయంలో బీఎస్సీ పూర్తి చేశారు. దేశంలోని పలు ఐసీఆర్‌ఏ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 1994లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ISCA) యంగ్ సైంటిస్ట్ అవార్డును గెలుచుకున్నారు. 1998లో ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ గోల్డెన్ జూబ్లీ మెమోరేషన్ యంగ్ సైంటిస్ట్ అవార్డు ఆయనను వరించింది. 2001లో ISCA డా. BC డెబ్ మెమోరియల్ అవార్డును పొందారు. 2001లో IRRI అత్యుత్తమ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అవార్డు, 2007 ISCA ప్రెసిడెంట్, అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ సైన్సెస్ విభాగంలో అవార్టులను కైవసం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed