CWC Qualifiers 2023: సీన్‌ విలియమ్స్‌ మెరుపు సెంచరీ.. నేపాల్‌‌పై జింబాబ్వే ఘన విజయం

by Vinod kumar |
CWC Qualifiers 2023: సీన్‌ విలియమ్స్‌ మెరుపు సెంచరీ.. నేపాల్‌‌పై జింబాబ్వే ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifiers 2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు సీన్‌ విలియమ్స్‌ మెరుపు సెంచరీ బాదాడు. కేవలం 70 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (70 బంతుల్లో) నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు రెగిస్‌ చకబ్వా పేరిట ఉండేది. చకబ్వా.. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు క్రెయిగ్‌ ఎర్విన్‌ (128 బంతుల్లో 121 నాటౌట్‌; 15 ఫోర్లు, సిక్స్‌) అజేయ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌.. కుశాల్‌ భూర్టెల్‌ (99), ఆసిఫ్‌ షేక్‌ (66), కుశాల్‌ మల్లా (41), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లలో నగరవా 4 వికెట్లు తీసి నేపాల్‌ను దారుణంగా దెబ్బకొట్టిగా.. మసకద్జ 2, చటారా, ముజరబాని తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed