CWC Qualifiers 2023: రాణించిన పూరన్‌, హోల్డర్‌.. పసికూనపై విండీస్‌ విజయం

by Vinod kumar |
CWC Qualifiers 2023: రాణించిన పూరన్‌, హోల్డర్‌.. పసికూనపై విండీస్‌ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifiers 2023లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో యూఎస్‌ఏపై వెస్టిండీస్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. జాన్సన్‌ ఛార్లెస్‌ (66), షాయ్‌ హోప్‌ (54), రోప్టన్‌ ఛేజ్‌ (55), జేసన్‌ హోల్డర్‌ (56), నికోలస్‌ పూరన్‌ (43) రాణించడంతో విండీస్‌ 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. స్టీవెన్‌ టేలర్‌, సౌరభ్‌ నేత్రావాల్కర్‌, కైల్‌ ఫిలిప్‌ తలో 3 వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌ఏ ఆటగాళ్లు 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేశారు. గజానంద్‌ సింగ్‌ (101 నాటౌట్‌) వీరోచిత సెంచరీ చేయగా.. ఆరోన్‌ జోన్స్‌ (23), షయాన్‌ జహంగీర్‌ (39), నోస్‌తుష్‌ కెంజిగే (34) రాణించారు. విండీస్‌ బౌలర్లలో కైల్‌ మేయర్స్‌, అల్జరీ జోసఫ్‌ తలో 2 వికెట్లు, జేసన్‌ హోల్డర్‌, రోస్టన్‌ ఛేజ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed