CWC Qualifier 2023: సెంచరీలతో చెలరేగిన హోప్‌, పూరన్‌.. నేపాల్‌‌పై విండీస్‌ భారీ విజయం

by Vinod kumar |
CWC Qualifier 2023: సెంచరీలతో చెలరేగిన హోప్‌, పూరన్‌.. నేపాల్‌‌పై విండీస్‌ భారీ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifier 2023లో భాగంగా వెస్టిండీస్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. నికోలస్‌ పూరన్‌ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కి విండీస్‌ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. హోప్‌, పూరన్‌ జోడీ నాలుగో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాని​ జోడించి తమ జట్టు భారీ స్కోర్‌ చేయడానికి బాటలు వేశారు. ఆఖర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (29), జేసన్‌ హోల్డర్‌ (16 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించారు. ఫలితంగా విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నేపాల్‌ బౌలర్లలో లలిత్‌ రాజ్‌బంశీ 3.. కరణ్‌, గుల్షన్‌ ఝా, సందీప్‌ లామిచ్చేన్‌, దీపేంద్ర సింగ్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్‌.. 49.4 ఓవర్లలో 238 పరుగులకే అలౌటై ఓటమిపాలైంది. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో ఆరిఫ్‌ షేక్‌ (63) అర్ధసెంచరీ సాధించగా.. గుల్సన్‌ ఝా (42), రోహిత్‌ పౌడెల్‌ (30), ఆసిఫ్‌ షేక్‌ (28), కరణ్‌ (28), దీపేంద్ర సింగ్‌ (23) రాణించారు. విండీస్‌ బౌలర్లు జేసన్‌ హోల్డర్‌ (3), అల్జరీ జోసఫ్‌ (2), కీమో పాల్‌ (2), అకీల్‌ హొస్సేన్‌ (2), కైల్‌ మేయర్స్‌ (1) వికెట్లు తీశారు.

Advertisement

Next Story

Most Viewed