మొగుడు వదిలేసిన 38 ఏళ్ల స్టార్ హీరోయిన్‌తో శుభ్‌మన్ గిల్ డేటింగ్.. వెలుగులోకి వచ్చిన ఎఫైర్ వ్యవహారం?

by Disha Web Desk 9 |
మొగుడు వదిలేసిన 38 ఏళ్ల స్టార్ హీరోయిన్‌తో శుభ్‌మన్ గిల్ డేటింగ్.. వెలుగులోకి వచ్చిన ఎఫైర్ వ్యవహారం?
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ తారలకు-క్రికెటర్లకు ఎఫైర్స్ కొనసాగడం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. పలువురు క్రికెటర్లు, పలు హీరోయిన్లు రిలేషన్‌లో ఉన్నారంటూ తరచూ సోషల్ మీడియాలో వార్తలు వింటూనే ఉంటాం. ఈ మధ్యకాలంలో కూడా బాలీవుడ్, ఇండియన్ క్రికెటర్ల మధ్య కూడా సంబంధాలు, డేటింగ్ వ్యవహారాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అయితే ఓ స్టార్ క్రికెటర్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. భారత స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, హాలీవుడ్ అందాల భామ అనా డి ఆర్మాస్ అనే నటి మధ్య ఎఫైర్ నడుస్తోన్నట్లు నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ఐపీఎల్) సీజన్ రసవత్తంగా సాగుతోంది. శుభ్‌మన్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో జరిగిన మ్యాట్ సందర్భంగా ఆర్మాస్ స్టేడియంలో తళుక్కున మెరిసింది. దీంతో కెమెరాలను సైతం తనవైపే తిప్పుకుంది. ప్రస్తుతం ఆర్మాస్-శుభ్‌మన్ ఫొటోలు పక్కపక్కకు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. వీరిద్దరి మధ్య ఓ రేంజ్‌లో రొమాన్స్ నడుస్తుందని చర్చించుకుంటున్నారు. ఇక శుభ్‌మన్ గిల్, భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నట్లు మొన్నటిదాక నెట్టింట వార్తలు మారుమోగాయి. శుభ్‌మన్, సారాకు అన్యాయం చేస్తున్నాడని ఫ్యాన్స్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొగుడు వదిలేసిన 38 ఏళ్ల హీరోయిన్‌తో డేటింగ్ అవసరమా అంటూ గిల్ పై నెట్టింట నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed