ఇకపై ఆ రూల్ తప్పనిసరి.. క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

by Vinod kumar |
ఇకపై ఆ రూల్ తప్పనిసరి.. క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి ప్రతి ఆస్ట్రేలియా ఆటగాడు నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌తో బ్యాటింగ్‌కు దిగడం తప్పనిసరి చేసింది. ఇటీవలి కాలంలో బ్యాటర్లు తరుచూ ఫాస్ట్‌ బౌలింగ్‌లో గాయపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, టిమ్‌ డేవిడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌ తదితరులు నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌ ధరించేందుకు ఇష్టపడరు. సీఏ తాజా నిర్ణయంతో వీరంతా తప్పనిసరిగా ఈ హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది.

నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్లను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఫిలిప్‌ హ్యూస్‌ మరణాంతరం (2012) ప్రత్యేకంగా తయారు చేయించింది. హ్యూస్‌ ఈ నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోయే వాడు కాదు. 2019 యాషెస్‌ సిరీస్‌లో ఇంచుమించు ఇలాంటి ప్రమాదమే మరొకటి సంభవించి ఉండేది. నాడు ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ సంధించిన బౌన్సర్‌ స్టీవ్‌ స్మిత్‌ను మెడ భాగంలో బలంగా తాకింది. అంత జరిగాక కూడా స్మిత్‌ నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌ ధరించేందుకు ఇష్టపడే వాడు కాదు.

వార్నర్‌ సైతం నెక్‌ ప్రొటెక్టర్‌ ధరిస్తే, అది తన మెడలోకి చొచ్చుకుపోయేదని చెప్పి తప్పించుకునే వాడు. సీఏ తాజా నిర్ణయంతో వీరు కారణాలు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న సిరీస్‌ సందర్భంగా రబాడ వేసిన బౌన్సర్‌ కెమారూన్‌ గ్రీన్‌ మెడ భాగంలో బలంగా తాకింది. అయితే అతను ఈ నెక్‌ ప్రొటెక్టర్‌ ఉండటంతో బ్రతికి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే క్రికెట్‌ ఆస్ట్రేలియా నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది.

మరోవైపు స్వదేశంలోనూ బౌన్సీ పిచ్‌లు ఎక్కువగా ఉండటంతో దేశవాలీ క్రికెటర్లు కూడా ముందు జాగ్రత్తగా ఈ నెక్‌ ప్రొటెక్టర్‌ హెల్మెట్‌ ధరించి బ్యాటింగ్‌కు దిగాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటన జారీ చేసిం‍ది. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్ అమలులోకి తీసుకురానున్నారు. అయితే 2015లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లతో సహా అనేక మంది టాప్ బ్యాట్స్‌మెన్ ఈ నెక్ ప్రొటెక్టర్‌ ధరించడానికి నిరాకరించారు. దీంతో ఈ రూల్ పాటించని ఆటగాళ్లకు కఠిన చర్యలు తప్పవని ఆసీస్ బోర్డు హెచ్చరించింది. ప్రస్తుతం ఈ రూల్ పట్ల నెటిజన్స్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed