CPL 2023: మళ్లీ బ్యాట్‌ పట్టనున్న అంబటి రాయుడు..

by Vinod kumar |   ( Updated:2023-08-11 13:38:15.0  )
CPL 2023: మళ్లీ బ్యాట్‌ పట్టనున్న అంబటి రాయుడు..
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఎల్‌లో ఆడనున్న రెండో భారత క్రికెటర్‌గా అంబటి రాయుడు రికార్డులకెక్కనున్నాడు. ఈ నెల ఆఖరిలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయుడు బరిలోకి దిగనునున్నాడు. ఈ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్‌ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు రాయుడు ప్రాతినిథ్యం వహించనున్నాడు. అంతకముందు 2020 సీజన్‌లో భారత స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ తరఫున సీపీఎల్‌లో ఆడాడు. సెయింట్ కిట్స్ అండ్‌ నెవిస్ పేట్రియాట్స్‌ జట్టుతో జత కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది సీపీఎల్‌లో సెయింట్ కిట్స్‌కు నావంతు సహకారం అందిస్తానని రాయుడు పేర్కొన్నాడు. కాగా సీపీఎల్‌-2023 సీజన్‌ ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానుంది.

Advertisement

Next Story